ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హనుమకొండ జిల్లా : దేశంతో గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులంతా 6 కన్సల్టెన్సీ సంస్థలకు సంస్థలకు సంబంధించిన వారని సీపీ తెలిపారు. అందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ దేశాలకు పంపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్ఈ ముఠా నుంచి పలు యూనివర్సిటీలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్ టాప్ లు, ఒక ఐపాడ్ , 2 ప్రింటర్లు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్ బాటిల్స్,. 5 సీపీయూలు, 1 లామినేషన్ మిషన్, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లు, 12 సెల్ ఫోన్లను స్వాధీన చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన దార అరుణ్ అని సీపీ పేర్కొన్నారు.

ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్స్పోర్స్ ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాస్, సంతోష్, ఎస్, ఐలు ప్రేమానందం, ప్రియదర్శిని, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుల్లు మహేందర్, సృజన్, శ్రీనివాస్, శ్రీకాంత్, అలీ, డ్రైవర్ శ్రీనివాస్ ను సీపీ తరుణ్ జోషి అభినందించారు .