ప్రధాని ఆశీస్సులు తీసుకున్న విజయ్-రష్మిక

ప్రధాని మోడీ ఆశీస్సులు తీసుకున్న విజయ్-రష్మిక

-ఫోటో విడుదల చేసిన విజయ్ టీం
-మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్
-ప్రధాని మోడీని ఆహ్వానించిన విజయ్-రష్మిక

ప్రధాని ఆశీస్సులు తీసుకున్న విజయ్-రష్మికవరంగల్ టైమ్స్, రాజస్థాన్: టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యే ‘విరోషి’ పెళ్లి జరుగగా చిత్ర పరిశ్రమ, క్రీడా రంగాలకు చెందిన, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ తాజ్ కృష్ణలో మార్చి4న భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారు. మార్చి 4న జరుగబోయే ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు.

ఇదిలా ఉండగా..వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే ఈ జంట ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు గోప్యంగా ఉన్న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను తాజాగా విజయ్ టీం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోడీని కలిసి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు మార్చి 4న హైదరాబాద్ లో జరుగనున్న తమ రిషెప్షన్ కు ఆయనను ఆహ్వానించారు.ఈ సందర్బంగ ప్రధాని నూతన దంపతులకు తన శుభాకాంక్షలు తెలియచేసినట్లు సమాచారం.