మెడికో ప్రీతికి బ్రెయిన్ డెడ్ : నిమ్స్ వైద్యులు 

మెడికో ప్రీతికి బ్రెయిన్ డెడ్ : నిమ్స్ వైద్యులు

మెడికో ప్రీతికి బ్రెయిన్ డెడ్ : నిమ్స్ వైద్యులు వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి చుట్టూ పోలీసుల భద్రతను పెంచారు. నిమ్స్ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగవడం లేదని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థినికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోసారి రాత్రి 8 గంటలకు ప్రీతి ఆరోగ్యంపై మరో బులిటెన్ విడుదల చేయనున్నారు.

సీనియర్ వేధింపులు భరించలేక వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ప్రీతి కోలుకుంటుందన్న నమ్మకం లేదని తెలిపారన్నారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన కూతురు బ్రతికి మళ్లీ తిరిగి వస్తుందన్న ఆశలు లేవని కన్నీళ్లపర్యంతమయ్యారు. మొదటి రోజుతో పోలిస్తే ఇంకా పరిస్థితి మరింత క్షీణించిందని చెప్పారు. తన కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.