రూ.కోటితో ముదిరాజ్ భవన్ కు శంకుస్థాపన

రూ.కోటితో ముదిరాజ్ భవన్ కు శంకుస్థాపన

నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బండ ప్రకాష్, దాస్యం, అరూరి

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ 44,45వ డివిజన్ల పరిధిలోని కడిపికొండలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ముదిరాజ్ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , కూడా చైర్మన్ సుందర్ రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు.రూ.కోటితో ముదిరాజ్ భవన్ కు శంకుస్థాపనఅనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల వృత్తులు, కుల సంఘాల అభివృద్ధికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని వారు తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు చేపల వ్యాపారం చేసుకునేందుకు ముదిరాజ్ లకు సబ్సిడీ ద్వారా ద్విచక్ర వాహనాలు, టాటా ఏస్ వాహనాలను సైతం అందజేసినట్లు వెల్లడించారు.

మిషన్ కాకతీయ పథకం ద్వారా గ్రామాలలోని చెరువులకు మరమ్మత్తులు చేయించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మత్స్య సంపదకు కొరత లేదని, ఏడాది పొడవునా చేపలు దొరుకుతున్నాయని అన్నారు. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, ముదిరాజ్ కుల సంఘం నాయకులు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.