తల్లితో మెడికో ప్రీతి చివరి మాటలు
వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. ఆమెను వేధించిన సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి ముందు తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ ఫోన్ కాల్ కి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తన సీనియర్ వేధింపులు భరించలేకపోతున్నానని, చదువుకోలేకపోతున్నానంటూ ప్రీతి తన బాధను తల్లితో పంచుకుంది. అయితే తల్లి తన కూతురికి అధైర్య పడొద్దని చెప్పినప్పటికీ కూడా ఆమె నిస్సహాయ స్థితిలో మాట్లాడినట్లు ఆ ఆడియోక్లిప్ లో ఇట్టే తెలిసిపోతుంది. ఆ తర్వాత ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.