ఫ్రెండ్ ని చంపిన హరిహరకృష్ణ కరీమాబాద్ వాసి
వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ఒళ్లు గగుర్పొడిచే మర్డర్ ఇది. ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని ఫ్రెండ్ అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేసిన మానవత్వం లేని ఓ యువకుడు. ఈ నెల 17న హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్నేహితుడి నవీన్ ను దారుణ హత్య ఆలస్యంగా వెలులోకి వచ్చింది. ఈ వార్త సంచలనంగా మారింది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఏకంగా స్నేహితుడినే హరిహర కృష్ణ దారుణంగా హత్య చేశాడు.
అయితే బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న హరిహరకృష్ణ వరంగల్ జిల్లా కరీమాబాద్ కు నివాసి. హరిహర కృష్ణ తండ్రి ఆర్ఎంపి వైద్యుడు. హరిహరకృష్ణ అన్న ముఖేష్ కు కూడా నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం. పలు కేసుల్లో నిందితుడి అన్న ముఖేష్ కి రౌడీ షీటర్ కూడా కేసులు నమోదు. అయితే గత ఐదేండ్ల క్రితం నిందితుడి అన్న ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.