సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా గ్రాండ్ విక్టరీ

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా గ్రాండ్ విక్టరీసెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. 2వ ఇన్నింగ్స్ లో 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీలు, కేవలం 191 రన్స్ కే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో టీంఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా, షమీలు చెరో మూడేసి వికెట్లు తీశారు.

అశ్విన్, సిరాజ్ లు రెండే వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా టీంలో ఎల్గర్ 77, బవుమా 35 పరుగులు చేశారు. సెంచూరియన్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా, ఈ సంవత్సరానికి స్వీట్ విక్టరీతో గుడ్ బై చెప్పింది.

వాస్తవానికి మొదటి రోజే టీంఇండియా ఆధిపత్యాన్ని చాటింది. రెండవ రోజు వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. ఇక 3వ రోజు ఏకంగా 18 వికెట్లు పడ్డాయి. అక్కడే మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, అద్భుతమైన సెంచరీతో ఇండియాను ఆదుకున్నారు. దీంతో టీంఇండియా భారీ స్కోర్ చేయగల్గింది.

కానీ వర్షం తర్వాత సెంచూరియన్ పిచ్ పూర్తిగా మారిపోయింది. ఆ పిచ్ పై బౌలర్లు తమ సత్తా చాటారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియాను 174 పరుగులకే ఔట్ చేశారు. ఇండియన్ బౌలర్లు కూడా 2 ఇన్నింగ్స్ లోనూ రాణించారు. దక్షిణాఫ్రికాను రెండు సార్లు 200 స్కోర్ లోపే ఔట్ చేశారు. సెంచరీ హీరో రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.