రష్యా దూకుడుకు..దద్దరిల్లిన కీవ్

రష్యా దూకుడుకు..దద్దరిల్లిన కీవ్

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: రష్యా దూకుడు పెంచింది. నిన్న రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడింది. రెండు చోట్ల అత్యంత శక్తివంతమైన పేలుళ్లు జరిగాయి. కీవ్ తో పాటు ఇతర ఉక్రెయిన్ నగరాల్లోనూ నిన్న రాత్రి భీకర దాడులు జరిగాయి. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో 4 సార్లు భారీ పేలుళ్ల శబ్దాలు కీవ్ లో వినిపించాయి. దాడుల సమయంలో ఆశాశం వెలుతురుతో నిండిపోయింది. కొన్ని చోట్ల ఆ సంఘటలను వీడియోలకు దొరికాయి.రష్యా దూకుడుకు..దద్దరిల్లిన కీవ్అయితే కీవ్ లో రష్యా సేనలు దేన్ని టార్గెట్ చేశాయో స్పస్టం కావడం లేదు. ఆ భారీ పేలుళ్లలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్న విషయం కూడా ఇంకా తెలియదు. నిన్న కీవ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించింది. రష్యా దాడుల నుంచి ఓ షెల్టర్ లో వందల మంది తలదాచుకుంటున్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. రష్యా వదిలిన మిస్సైల్ ను ఇంటర్ సెప్టార్ తో అడ్డుకున్నామని, దాని శకలం వచ్చి ఆ ప్రాంతంలో పడినట్లు ఉక్రెయిన్ బలగాలు చెబుతున్నాయి.