ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని పకడ్భంధీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వంగపహాడ్, సిద్దాపూర్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలుతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నిరంతర నీటి సరఫరా, మరుగు దొడ్లు, విద్యుదీకరణ త్రాగు నీరు, ఫర్నీచర్, పెయింటింగ్ ,పెద్ద తరహా, చిన్న తరహా మరమ్మత్తులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహారి గోడ నిర్మాణం, వంట గది, శిథిల భవనాల స్థానంలో నూతన గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో భోజనశాల నిర్మాణం, డిజిటల్ సౌకర్యాలు పాఠశాల వనరుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల కోసం కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, లేదా మున్సిపాల్ చైర్మన్ మరియు ఫీల్డ్ ఇంజనీర్ల పేరు పై బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

పాఠశాలలో చేపట్టబోయే పనులను వెంటనే గుర్తించి పనుల అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బి.సత్య నారాయణరెడ్డి, సర్పంచ్ జె. ధనలక్ష్మి కిరణ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వెంకన్న, శ్రీధర్, దోమ కుమార్, రామ కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితులున్నారు