మారిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్

మారిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంతో అధికారులు మార్పులు చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు సైతం ఏప్రిల్ 20 నుంచే ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ మార్పు తప్పనిసరైంది.

మారిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20కి బదులు 22 నుంచి పరీక్షలు ప్రారంభించేలా కొత్త షెడ్యూల్ ను రూపొందించిన ఇంటర్ బోర్డు అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమతి కోసం పంపించారు. ఈ షెడ్యూల్ కు మంత్రి ఆమోదం తెలిపింది. బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కొత్త టైం టేబుల్ ను విడుదల చేశారు. ఇక గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ ను నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఏప్రిల్ 11, 12న జరుగుతాయి.