ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా..ఎందుకంటే?

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా..ఎందుకంటే?

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు మంత్రి సురేష్ పరీక్షల వాయిదా విషయాన్ని వెల్లడించారు. జేఈఈ పరీక్షల షెడ్యూల్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను ప్రకటించారు. ఏప్రిల్ 9 నుంచి 28 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల బదులు ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. మారిన పరీక్షల షెడ్యూల్ ను విద్యార్థులు గమనించాలని కోరారు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు యాథావిధిగా మార్చి 11 నుంచి మార్చి 31 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.