బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం

బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలంముంబై : బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరీనా కపూర్ తో పాటు పలువురు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. నిన్న నటుడు అర్జున్ కపూర్ తో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నోరా ఫతేహికి సైతం కరోనా సోకింది. దీంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించారు. జీవితం కంటే ముఖ్యమైంది ఏదీ లేదని పోస్ట్ చేసింది. ముంబైలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ లపై ప్రభావం పడుతుంది.ఇప్పటికే పలు సినిమాలు సైతం వాయిదా పడ్డాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం విదితమే.