ఇక తెలుగు, తమిళంలో బిబి

తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్ఇక తెలుగు, తమిళంలో బిబిహైదరాబాద్​: ప్ర‌ముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న అమెజాన్ ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్ ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా అభిమానుల కోసం తమిళం మరియు తెలుగులో కూడా లభ్యం కానుంది. అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బరాత్) నిర్మాణ సారథ్యంలో ఆనంద్ తివారీ (లవ్ పర్ స్వ్కేర్ ఫుట్) ద ర్శకత్వంలో తెర‌కెక్కిన ఫేమ‌స్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్. పాప్ మరియు క్లాసికల్ ఇలా రెండు విభిన్న సంగీత‌ నేపథ్యాల్లో పెరిగి పెద్దయిన ఇద్దరు సంగీత కళాకారుల కథ ఇది. ఈ పది భాగాల సిరీస్ లో రిత్విక్ భౌమిక్ (దుసార్) హిందుస్థానీ క్లాసికల్ గాయకుడు రాధేగా, శ్రేయ చౌదరి (డియర్ మాయా) పాప్ స్టార్ తమన్నాగా నటించారు. నసీరుద్దీన్ షా (ఎ వెడ్ నెస్ డే, ది లీగ్ ఆఫ్ ఎక్స్ ట్రార్డినరీ జంటిల్ మెన్), అతుల్ కుల్ కర్ణి (పేజ్ 3, రంగ్ దే బసంతి), కునాల్ రాయ్ కపూర్ (లవ్ పర్ స్వ్కేర్ ఫుట్, ఢిల్లీ బెల్లీ), షీబా చద్దా (మీర్జాపూర్, తలాష్) మరియు రాజేశ్ తైలంగ్ (మీర్జాపూర్, ది సెకండ్ బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్) వంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటించారు. ఈ షో తోనే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు శంకర్ ఇషాన్ లాయ్ డిజిటిల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. భారత్ మరియు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లకు చెందిన ప్రైమ్ సభ్యులు ఇప్పుడు డిసెంబర్ 16 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో బాండిష్ బాండిట్స్ ను తమిళం మరియు తెలుగులో కూడా చూడవచ్చు.