వలస” ట్రైలర్ విడుదల..

వలస” ట్రైలర్ విడుదల..జనవరి 1న విడుదల కానున్న సినిమా ! వలస" ట్రైలర్ విడుదల..హైదరాబాద్​: కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో రోడ్డున పడ్డ లక్షలాది మంది కార్మికుల బ్రతుకు చిత్రమే వలస. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్యా ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్ర బాబు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “వలస”. ఈ చిత్రం ట్రైలర్ డిసెంబర్ 16న విడుదలైంది.. ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరి నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని జనవరి 1న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా బీ బాపిరాజు రిలీజ్ చేస్తున్నారు. మనోజ్ నందం, తేజు అనుపోజులు ఒక జంటగా వినయ్ మహాదేవ్, గౌరీ మరో జంటగా నటించారు.. సమస్యలలో ఉన్నప్పుడు వికసించే మానవ సంబంధాల గురించిన అందమైన విశ్లేషణ ఈ చిత్రంలో ఉంటుంది. ‘సాటి మనిషి కష్టాలలో ఉన్నప్పుడు ముందుకి వచ్చిన మంచితనం గురించి, ఒత్తిడిలో అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదాల గురించి ఈ చిత్రంలో అద్భుతంగా తెరకెక్కించాం. ఇది కేవలం వలస కూలీల కష్టాలను ఏకరువు పెట్టె చిత్రం మాత్రం కాదు.. ఇది వారి ఆత్మ స్థైర్యానికి ఇచ్చిన ఒక సెల్యూట్ అని చిత్రయూనిట్​ బృందం తెలిపింది. కెమెరా,ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన నరేష్ కుమార్ మడికి ప్రేక్షకులకి వారితో పాటు నడిచే అనుభూతిని కలుగజేస్తారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతంలో స్వరపరిచిన పాట మరియు నేపథ్య సంగీతం చిత్రానికి మరింత జీవం అందించాయని’చిత్ర యూనిట్ తెలిపింది. ఎఫ్ ఎం బాబాయ్, సముద్రం వెంకటేష్, తులసి రామ్, నల్ల శీను, తనూష డింపుల్, మనీషా, చిన్నారి, ప్రవీర్, వాసు, వెంకట్ రామన్, మల్లికా, రమణి, కనకా రావు, సాజిద్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సహా నిర్మాతలు: శరత్ ఆదిరెడ్డి, రాజా జి, నిర్మాత : యక్కలి రవీంద్ర బాబు, రచన, దర్శకత్వం : పీ సునీల్ కుమార్ రెడ్డి.