చెన్నమనేని పౌరసత్వంపై విచారణ

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై విచారణ..మెమోదాఖలు చేయడంపై కేంద్రహోంశాఖపై సీరియస్​

చెన్నమనేని పౌరసత్వంపై విచారణహైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అఫిడవిట్​ దాఖలు చేయకుండా మెమో వేయడంపై కేంద్ర హోంశాఖ తీరును తప్పుపట్టింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై ఎంబసీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని గత నవంబర్ 18 న కేంద్ర హోం శాఖ ను హైకోర్టు ఆదేశించింది. అయితే వివరాలు రాబట్టకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఎంబసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అని ప్రశ్నించింది . ఫిబ్రవరి 2020 లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్ళీ ఇవ్వడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మన్ ఎంబసీ నుంచి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20 కి కోర్టు వాయిదా వేసింది.