డబుల్​ బెడ్రూం ఇళ్ల ఘనత కేసీఆర్​దే​

డబుల్​ బెడ్రూం ఇళ్ల ఘనత కేసీఆర్​దే​హైదరాబాద్​: రాష్ట్రంలో డబుల్​బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​దేనని మంత్రి కేటీఆర్​ అన్నారు. నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్​లో రైతుబజార్​ వద్ద నిర్మించిన 324 డబుల్​బెడ్రూం ఇళ్లను బుధవారం కేటీఆర్​ ప్రారంభించారు. పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్​ ఉద్ధేశమన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లు నిర్మించలేదని తెలిపారు. రెండు పడక గదులు ఒక హాల్​ ,కిచెన్​తోపాటు రెండు బాత్రూమ్​లను నిర్మించినట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.9లక్షల ఖర్చు పెట్టి నిర్మించినట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.50 లక్షలు విలువ చేసే ప్లాట్​ను పేదలకు సీఎం కేసీఆర్​ ఇస్తున్నారని తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాక్​లుగా 9 అంతస్తుల్లో ఈ ఇండ్లను రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించామని చెప్పారు. ఇండ్ల ప్రారంభంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి , ఎమ్మెల్సీ ఈగ మల్లేశం, గ్రేటర్​ మేయర్ బొంతురామ్మోహన్​ , ఎమ్మెల్యే శ్రీదేవిరెడ్డి సుధీర్​రెడ్డి​ తదితరులు పాల్గొన్నారు.

డబుల్​ బెడ్రూం ఇళ్ల ఘనత కేసీఆర్​దే​

డబుల్​ బెడ్రూం ఇళ్ల ఘనత కేసీఆర్​దే​