‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ లాంచ్​

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' షోరీల్ లాంచ్​హైదరాబాద్​ : తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’. డిసెంబర్ 25న ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ను తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ‘జీ 5’ కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ దీనిని నిర్మించిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సిరీస్ షోరీల్ విడుదల చేశారు. ‘లూజర్’ నుంచి ‘చదరంగం’, ‘గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)’ వరకు ఒరిజినల్ వెబ్ సిరీస్ నుంచి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్​టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా – డిఫరెంట్ జానర్ కంటెంట్ ‘జీ 5’ ప్లాట్‌ఫామ్ వీక్షకులకు అందించింది. ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’తో మరోసారి వీక్షకుల మనసు గెలుచుకునేలా ఉంది. ‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’. ‘జీ 5’ అసోసియేష‌న్‌తో దీనిని నిర్మించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, తేజా కాకుమాను తదితరులు ప్రధాన పాత్రధారులు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని ‘జీ 5’ వర్గాలు వెల్లడించాయి. “జీ 5 ఓటీటీకి హెడ్ గా మాత్రమే కాకుండా మా అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటార్ గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ‘ఓయ్’ నేను చూశా. ‘జీ 5’ మద్దతుతో డిసెంబర్ 25న విడుదలవుతున్న ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’తో మంచి ఎండింగ్ ఇస్తామని ఆశిస్తున్నా అన్నారు’ మెగా పవర్ స్టార్​ రామ్​చరణ్.​ ఈ కార్యక్రమంలో నటీనటులు నందినీరాయ్, తేజ, సందీప్ సాహు, మొయిన్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్, ఎడిటర్ నారాయణ, పబ్లిసిటీ పోస్టర్ డిజైనర్లు అనిల్-భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.’షూట్-అవుట్ ఎట్ ఆలేరు’లో ఐజీ ప్రవీణ్ చంద్ పాత్రలో శ్రీకాంత్, ఎస్పీ సూర్యనారాయణగా ప్రకాష్ రాజ్, అక్తర్ పాత్రలో తేజా కాకుమాను, నఫీసాగా నందినీ రాయ్, నాసిర్ పాత్రలో సందీప్ సాహు, సెల్వ కుమారిగా గాయత్రీ గుప్తా, యు. రాకేష్ పాత్రలో మొయిన్ నటించారు.

ఈ సిరీస్ నిర్మాతలు : శ్రీమతి సుష్మితా కొణిదెల, విష్ణుప్రసాద్
దర్శకుడు : ఆనంద్ రంగా
ఛాయాగ్రహణం: అనిల్ బండారి
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
మ్యూజిక్ డైరెక్టర్: నరేష్ కుమారన్
ఎడిటర్: నారాయణ
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్ – భాను
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్య పోట్ల