సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ వాయిదా

సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ వాయిదాఢిల్లీ : సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2021 జనవరి – ఫిబ్రవరిలో 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియల్ మంగళవారం వెల్లడించారు. ఉపాధ్యాయులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన ఈ పరీక్షలకు త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.