మరింత చవకగా కరోనా పరీక్షలు

మరింత చవకగా కరోనా పరీక్షలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్​ : తెలంగాణలోని ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొవిడ్‌ నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధర రూ. 850 ఉండగా, దాన్ని రూ. 500 కు తగ్గించింది. అలాగే నివాసాల్లో తీసుకొనే శాంపిల్‌ పరీక్ష ధరను రూ. 1200 నుంచి రూ. 750 కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.మరింత చవకగా కరోనా పరీక్షలు