యాదాద్రిలో తాత్కాలికంగా కైంకర్యాలు రద్దు

యాదాద్రిలో తాత్కాలికంగా కైంకర్యాలు రద్దుయాదాద్రి భువనగిరి జిల్లా : ఈ నెల 25 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కోవిడ్ -2 దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నామని ఆమె తెలిపారు. 25వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో భక్తులచే జరుపబడు కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.