24న మెగా జాబ్​మేళా

24న మెగా జాబ్​మేళారంగారెడ్డి జిల్లా : కొవిడ్ మహమ్మారి వల్ల ఎందరో జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు ,చదువు పూర్తయిన కూడా ఉద్యోగం దొరకక ఎన్నో కష్టాల పాలైన నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు కేఎంఆర్​ ట్రస్ట్ (కొత్త మనోహర్ రెడ్డి ట్రస్ట్) ముందుకొచ్చించి. ఒకటి కాదు, రెండుకాదు సుమారు 50 కంపెనీ లను ఒకే చోటికి చేర్చింది. వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో 24 వతేదీన న కర్మన్ ఘాట్ లో ఉన్న టీఎంఎస్​ఎస్​ ఉమెన్స్ డీగ్రీ కాలేజ్ లో (జీవన్ హాస్పిటల్ ఎదురుగా) ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉచితంగ జాబ్ మేళా నిర్వహించనుంది. దీంతో పాటు ఉద్యోగం లో సెలెక్టైన అభ్యర్థులకు చంపాపేట్ ఏపీఆర్​ గార్డెన్స్ లో 25 వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలనుంచి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ అందించనున్నట్లు ట్రస్ట్​ బాధ్యులు తెలపారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.