వరంగల్ అర్బన్ జిల్లా: వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ఆవరణలో విస్తృతంగా మొక్కలు నాటి సుందరీకరంగా తీర్చిదిద్దాలని వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 54 వ డివిజన్ లో గల వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్ లో గల హెయిర్ బ్లోయర్, మోటర్లు, క్యారీ ప్లేకెట్స్, సంఫ్, పంప్ హౌస్ లను తనిఖీ చేశారు. క్లోరిన్ నిర్వహణ తీరును డి.ఈ. ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా సుమారు 40 వేల ఇళ్లకు నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నట్లు, సక్రమంగా క్లోరిన్ శాతంతో సరఫరా చేయాలని ఆదేశించారు.ఇప్పటికే అక్రమ నల్లాలను తొలగించినప్పటికీ, ఏమైనా మిగిలి ఉంటే గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు.అంతర్గత పైపులైన్ల కనెక్షన్లు ఇవ్వడం ద్వారా మంచినీటి సరఫరా సామర్ధ్యం మరింత పెరుగుతుందని , జాప్యం జరగకుండా త్వరితంగా అంతర్గత పైపులైన్ల కనెక్ట్ చేయుటకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ శ్రీనివాస్ రావును ఫోన్లో ఆదేశించారు. ప్రస్తుతం దినం తప్పి దినం నీటి సరఫరా చేస్తున్నామని, అతి త్వరలో ప్రతి రోజు మంచినీరు అందించనున్నట్లు మేయర్ ప్రజలకు హామీ ఇచ్చారు. హరిత హారం కార్యక్రమంలో భాగం గా ఫిల్టర్ బెడ్ ఆవరణలో విస్తృతం గా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి సుందరికరంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రచించాలని డి.ఈ. ని మేయర్ గుండా ప్రకాష్ రావు ఆదేశించారు. మేయర్ తోపాటు స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాజు నాయక్, డి.ఈ. సంతోష్ బాబు, ఏ.ఈ.హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.