ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణహైదరాబాద్ : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు బిసి స్టడీసర్కిళ్లు శుభవార్త అందజేసాయి. కోవిడ్ సంక్షోభం నుండి ఆన్లైన్లో కొనసాగిన శిక్షణ ఇక నుండి ఆన్లైన్తో పాటు క్లాస్ రూంల్లోనూ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 11 స్టడీ సర్కిల్స్ లో ఈ నెల 22 వ తేదినుండి శిక్షణ ప్రారంబిస్తున్నామని బిసి స్టడీసర్కిళ్స్ డైరెక్టర్ బాలాచారి ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

జనరల్ స్టడీస్, ఆర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ తదితర అంశాలలో ఉచిత శిక్షణను 60 రోజుల పాటు ఇవ్వనున్నారు. ఆరుసెషన్ల చొప్పున ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఆయా స్టడీసర్కిళ్లలో ఫిజికల్ క్లాసులు కొనసాగుతాయి. ఈ కోచింగ్ కోసం 15622 మంది ఇదివరకే అప్లై చేసుకున్నారు, వీరికి బ్యాచ్ ల వారీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకే అప్లై చేసుకున్న వారు నేరుగా వారికి దగ్గరలోని బిసి స్టడీ సర్కిల్లో అడ్మిషన్ పొందవచ్చు. కోవిడ్ నిబంధనల ను పాటిస్తూ కోచింగ్ ఉంటుంది. దీంతోపాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCqArK3S0FcnpCDv5AlT0Eew ద్వారా అన్లైన్ క్లాసులు కొనసాగుతాయి, ఇతర వివరాలకు అభ్యర్థులు వారికి దగ్గరలోని స్టడీ సర్కిల్లో సంప్రదించవలసిందిగా కొరారు.