కాంగ్రెస్ వి డర్టీ పాలిటిక్స్: మోడీ
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన తెలపడంపై ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన డర్టీ పాలిటిక్స్ కోసం గ్లోబల్ ఈవెంట్‌ను ఎంచుకుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన సభలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కొన్ని పార్టీలు ఇండియా సక్సెస్ ను జీర్ణించుకోలేవు. ఏఐ సమ్మిట్ తో అది నిరూపితమైందని మోడీ అన్నారు. దేశమంతా ఎంతో గర్వంగా ఉన్న వేళ కాంగ్రెస్ ఇలాంటి పనిచేయడం దురదృష్టకరమని మోడీ మండిపడ్డారు.














