కరోనాతో అధైర్య పడొద్దు: మేయర్ గుండా ప్రకాష్ రావు

● కరోనాతో అధైర్య పడొద్దు : మేయర్ గుండా ప్రకాష్ రావు

● ప్రత్యేక పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

● జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు గల వారు స్వచ్ఛంద గా పరీక్షలు చేసుకోవాలి

వ‌రంగ‌ల్: ఫ్రంట్ లైన్ వారియర్లుగా నగర ప్రజలకు కీలకమైన సేవలు అందించాల్సిన గురుతరమైన బాధ్యత బల్దియా అధికారులు, సిబ్బందిపై ఉందని, కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించు కోవాలని నగర మేయర్ గుండా ప్రకాష్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వరంగల్లోని తన నివాసం హోమ్ కారన్ టైన్ నుండి కరోనా పాజిటివ్ వచ్చిన బల్దియా అధికారులు, ఉద్యోగులను టెలీఫోన్ ద్వారా పరామర్శించి, యోగ క్షేమాలు అడిగి వారిని మనోధైర్యాన్ని కల్పించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మనో నిబ్బరాన్ని కల్పించారు.కరోనాతో అధైర్య పడొద్దు: మేయర్ గుండా ప్రకాష్ రావునగర ప్రజలకు విశిష్ట సేవలు అందించాల్సిన ప్రస్తుత సమయంలో బల్దియా సిబ్బంది ఆరోగ్య వంతంగా ఉంటేనే ప్రజలకు సేవలందించ వచ్చని అన్నారు. బల్దియా ఉద్యోగుల సంక్షేమమే ధేయంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి కరోనా టెస్ట్ లు చేయిస్తున్నామని, గత 3 రోజులుగా 117 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా 37 ఉద్యోగులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు. ముందుగా అప్రమత్తంగా ఉండి కరోనా ను జయించవచ్చని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం హోమ్ కారన్ టైన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు లక్షణాలు కనిపించినా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్ ఒకరి నుండి మరొకరికి కరోనా వైరస్ విస్తరిస్తున్నా దృష్ట్యా దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నదని, నగరంలోని 14 అర్బన్ హెల్త్ సెంటర్ లలో ప్రజలకు కరోనా టెస్టులు చేయడంతో పాటు కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఔషధాల కిట్ ఉచితంగా అందిస్తున్నదని, ప్రమాదకరంగా ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని అన్నారు.

కరోనా బాధితులు ఎలాంటి ఆందోళన, అధైర్య పడొద్దని 17 రోజులు హోమ్ కారన్ టైన్లో ఉండి వైద్య శాఖ ఇచ్చే మందులను నిర్దేశిత సమయంలో క్రమం తప్పకుండా వాడుతూ సంప్రదాయ కాషాయం , ఆవిరి పట్టడం, బలవర్ధక ఆహారం తీసుకొనడం వల్ల సునాయాసంగా కరోనా ను జయించవచ్చని మేయర్ తెలిపారు. కరోనా నిర్ధారణ అయినా వారు త్వరగా కోలుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.