మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర..

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ కు సుఫారీ గ్యాంగ్ తో హత్యకు మహబూబ్ నగర్ కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తికి రూ. 12 కోట్ల సుఫారీ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఫరూక్ షేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర..నిందితుల్లో ఒకడైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో రఘు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించి వదిలేశారు. హత్య కుట్ర కోణాన్ని ఢిల్లీ పోలీసులకు సైబరాబాద్ పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, హత్య కుట్ర కోణాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఢిల్లీ పోలీసులకు తెలిపారు. హత్య కుట్రకు సంబంధించిన వివరాలను, అరెస్ట్ ను కాసేపట్లో మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించనున్నారు.