వృద్ధురాలికి తొలి టీకా

వృద్ధురాలికి తొలి టీకాహైదరాబాద్​: అమెరికాకు చెందిన ఫైజర్​ కంపెనీ రూపొందించిన టీకాను బ్రిటన్​ పంపిణీ ప్రారంభించింది. మొదటగా తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరేట్​ కీనస్​కు ఇచ్చారు. నార్త్​ ఐర్లాండ్​లోని ఎన్నిస్​కిల్లెన్​ ప్రాంతానికి చెందిన బామ్మకు ఈ టీకాను వేశారు. దీంతో ప్రపంచంలోనే మొదటిసారిగా ఫైజర్​ బయోఎన్​టెక్​ కోవీడ్​ టీకాను తీసుకున్న వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ టీకా తన జన్మదినం గిఫ్ట్​గా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. తొలుత 80 ఏళ్లు దాటి కోవిడ్​కు​ గురయ్యేవారికి ఈ టీకాను ఇవ్వనున్నట్లు ప్రధాని బోరిస్​ జాన్సన్​ తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా 40 లక్షల మందికి టీకాను ఇవ్వాలని బ్రిటన్​ భావిస్తోంది. సుమారు 8 లక్షల డోసులను ప్రభుత్వం కొన్ని వారాల్లోనే పంపిణీ చేయనున్నది.