స్టార్​ హీరోకు కరోనా పాజిటివ్​

స్టార్​ హీరోకు కరోనా పాజిటివ్​చెన్నై: సినీ ఇండస్ట్రీని కోవిడ్​ దయ లేకుండా కుదుపేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్​ బారిన పడి ఎందరో సినీ ప్రముఖులు తనువు చాలించారు. నిన్నటికి నిన్న బాలీవుడ్​ నటి దివ్యభట్నాగర్​ కేవలం 34 ఏళ్ల వయస్సులో కరోనాతో తనువు చలించింది. తాజాగా తమిళస్టార్​ హీరో శరత్​కుమార్​ కోవిడ్​ బారిన పడ్టట్లు ఆయన భార్య రాధిక ట్వీట్​ చేసింది. ‘ హైదరాబాద్​లో టెస్ట్ చేస్తే పాజిటివ్​ అని వచ్చింది . అయితే ఎలాంటి లక్షణాలు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్​ చేసింది’ రాధిక. ప్రస్తుతం ఆయన వైద్యుల సంరక్షణలోనే ఉన్నారని అభిమానులకు తెలిపింది. అయితే శరత్​ ఆరోగ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో అభిమానులకు తెలియజేస్తానని చెప్పారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని సోషల్​ మీడియా వేదిక రాధిక శరత్​కుమార్​ పోస్ట్​ పెట్టారు.