కేసీఆర్ బర్త్ డే..మహాన్నదానం చేసిన ఎమ్మెల్యే చల్లా

కేసీఆర్ బర్త్ డే..మహాన్నదానం చేసిన ఎమ్మెల్యే చల్లావరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ బర్త్ డే ను పురస్కంచుకుని తెలంగాణ రాష్ట్ర టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల వేడుకలు ఉమ్మడివరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు తమతమ పరిధిలో మొదటిరోజు ఫిబ్రవరి 15న అన్నదానం, పండ్ల దానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగానే పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాన్నదాన కార్యక్రమంలో నేరుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఇదే క్రమంలో ఆస్పత్రిలో డెలివరీ అయిన బాలింతలకు కేసీఆర్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.కేసీఆర్ బర్త్ డే..మహాన్నదానం చేసిన ఎమ్మెల్యే చల్లాతెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ , రాష్ట్ర పాలనను జాతీయస్థాయిలో కీర్తించబడేలా పరిపాలన కొనసాగిస్తున్న ఉద్యమ అధినేత, సీఎం కేసీఆర్ నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా వుండాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించాలని ఆ భగవంతున్ని కోరుతూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు కేసీఆర్ కు బర్త్ డే విషెష్ చెప్పి, దీవెనలు అందించారు.