మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా గంగవ్వ
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచాడు. ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న చిరు రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరుకి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు చిత్రాలలో నటించి మెప్పించిన గంగవ్వ, గాడ్ ఫాదర్, చిత్రంలో తల్లిగా నటించే వార్త నిజమైతే ఆమెకి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలిగా నటించనున్న విషయం తెలిసిందే.