ఇన్ స్టాలో తన బాధను చెప్పుకుంటున్న సమంత

ఇన్ స్టాలో తన బాధను చెప్పుకుంటున్న సమంత

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : పెళ్లైన నాలుగేళ్లకే తమ వివాహ జీవితానికి సమంత-నాగ చైతన్య ముగింపు పలికారు. 2017 , అక్టోబర్ 7న హిందూ, క్రిస్టియన్ పద్దతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట చివరి మజిలీకి చేరుకోకుండానే మధ్యలోనే విడిపోయి ఎవరి దారులు వారు చూసుకున్నారు. సరిగ్గా 2021 అక్టోబర్ 2న తమ వివాహ బంధం నుంచి తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇన్ స్టాలో తన బాధను చెప్పుకుంటున్న సమంతవిడాకుల ప్రకటన అనంతరం తొలిసారిగా ఇన్ స్టాగ్రామ్ లో సమంత స్పందించింది. ఫ్లయిట్ విండో నుంచి ఓ వీడియో షేర్ చేస్తూ ‘ ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్ లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం పూర్తి చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు. బద్ధకం వదిలి ముందుకు నడవాలి’ అని ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.

దీన్ని బట్టి చూస్తుంటే సమంతకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు, లక్ష్యాలు ఉండి ఉంటాయి. అందుకోసం వివాహబంధం అనే చట్రంలో ఇమిడి పోకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ, స్వతంత్రంగా ఎదగాలనుకుంటుందేమో కానీ మ్యారేజీ అయిన తర్వాత కొన్ని పరిమితులు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగలేకపోయి ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.