మొదలైన నిహారిక వివాహ వేడుక

మొదలైన నిహారిక వివాహ వేడుకఉదయ్​పూర్​: మెగా బ్రదర్​ నాగబాబు కూతురు నిహారిక, వెంకట చైతన్య వివాహ వేడుకలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. రెండు రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఉదయ్​పూర్​కోటకు చేరుకున్నారు. ఇప్పటికే వివాహ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రాత్రి జరిగిన సంగీత్​ వేడుక ఫోటోలు , వీడియోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక, చైతన్య జంట చిరంజీవి నటించిన బావగారూ.. బాగున్నారా.. సినిమాలోని ఆంటీకూతురా అమ్మో అప్సరా పాటకు ఫుల్​ జోష్​తో స్టెప్పులేసి అలరించారు. ఈ వీడియా సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది. మొదలైన నిహారిక వివాహ వేడుక9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వివాహం జరుగనుంది. 11న హైదరాబాద్​ జేఆర్​సీ కన్వెన్షన్​హాల్​లో వివాహ రిసెప్షన్​ జరుపనున్నారు. ప్రస్తుతం ఉదయ్​పూర్​లో ఉన్న చిరు తన ట్విట్టర్​ ద్వారా కాబోయే దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు అంటూ ట్వీట్​ చేశారు.

మొదలైన నిహారిక వివాహ వేడుక

మొదలైన నిహారిక వివాహ వేడుక

మొదలైన నిహారిక వివాహ వేడుక