హుజురాబాద్ లో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

హుజురాబాద్ లో ఇంకా కొనసాగుతున్న పోలింగ్కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ నమోదవుతున్నది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కువ వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

ఉదయం 9 గంటలకు 10.05 శాతం , 11 గంటలకు 33.27 శాతం, సాయంత్రం 5 గంట వరకు 76 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇంకా ఓటర్లు ఇంకా క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. దీంతో సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు.హుజురాబాద్ లో ఇంకా కొనసాగుతున్న పోలింగ్