“పుష్ప” మూవీ రివ్యూ”

హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో గతంలో ‘ఆర్య’, ‘ఆర్య2’ సినిమాలు వచ్చాయి. ‘ఆర్య’ సినిమా అదరగొట్టగా, ‘ఆర్య2’ ఫర్వాలేదనిపించింది. దాదాపు 12 యేళ్ల తర్వాత హ్యాట్రిక్ మూవీ ప్రకటించగానే అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. "పుష్ప" మూవీ రివ్యూ"ఊర మాస్ లుక్ లో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్, డీ గ్లామర్ పాత్రలో హీరోయిన్ రష్మిక మందన నటించిన సినిమా ‘పుష్ప’ . సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై ఈ సినిమా టీం భారీ అంచనాలను వేసుకున్నాయి. ఇక మొత్తానికి ఈ సినిమా శుక్రవారం రోజు థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కోసం థియేటర్ల వద్ద జనాలు ఎగబడుతున్నారు.

ఇక ఈ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ మిక్స్ చేసిన మదర్ సెంటిమెంట్, లవ్ యాంగిల్ , మధ్యమధ్యలో ఉద్వేగభరితమైన సంఘటనలు ప్రేక్షకులను అలరించాయి. అటు పాలు అమ్ముకునే దిగువ మధ్యతరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. బందీగా ఉన్న తండ్రిని రక్షించుకోవడానికి జాలిరెడ్డి దగ్గరకు వెళ్లే ముందు పుష్పాను కలిసి తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది."పుష్ప" మూవీ రివ్యూ"రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం మొక్కలు కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభిస్తాడు అల్లు అర్జున్ . అతి తక్కువ సమయంలో తన తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో పుష్పను అడ్డుపెట్టుకొని కోట్లు గడించిన కొండారెడ్డి, అతని తమ్ముళ్లకు ఎలా చుక్కలు చూపించాడు. ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం సీను పాత్ర, చిన్నప్పుడే ఇంటిపేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ చిత్రంలోని కథాంశం.

ఈసినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునిల్ పోషించిన పాత్ర కమేడియన్ గా తనకున్న ఇమేజ్ ని పూర్తిగా మరిచిపోయేలా చేసింది. సునిల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక గతంలో రంగస్థలం సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఈ సినిమాలో పెద్దగా పేరు రాలేదనే చెప్పచ్చు. ఇక సమంత ఐటమ్ సాంగ్ అదిరిపోయిందనుకోండి. ఈ సినిమాకే సమంత ఐటమ్ సాంగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పచ్చు.

ఇక మొత్తంగా ఈ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ కి వచ్చే సరికి మూవీ గ్రాఫ్ కొద్దిగా పడిపోయిన భావన కలుగుతుంది. మొత్తంగా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటీనటులతో పుష్ప బాగానే ఉందని చెప్పచ్చు. అయితే పుష్ప సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిందే మరీ.