పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత !

పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత !

పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత ! వరంగల్ టైమ్స్, హైదరాబాద్: అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు అని, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత మీదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి, నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 271 మంది గ్రూప్-1, 171 మంది గ్రూప్-2 అధికారులు, 51 మంది మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

పాలకులపై కొట్లాడేవాళ్లు శ్రీమంతులు కాదు,కాకతీయులపై సమ్మక్క-సారలమ్మ కొట్లాడి దేవతలయ్యారు.ఈ ప్రాంతంలో వేలాది మంది అమరవీరులయ్యారు.వీరుల స్ఫూర్తితో ఉద్యోగాలు చేపట్టాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా, కఠినంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.ఉద్యోగాలను అమ్ముకున్నామని కొంతమంది ప్రచారం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికపై కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టులో బలంగా మేం వాదనలు వినిపించామన్నారు. ఈ ప్రభుత్వం తప్పు చేయదని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో ముఖ్యపాత్ర వహించేది మీరేనని, సాయం చేసే టప్పుడు తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన గుర్తు చేశారు. చివరి వరకు ఇదే నిబద్దతతో పనిచేయాలని గ్రూప్1, 2 ఉద్యోగులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఇక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు జీతంలో కోత విధించే జీవోను తీసుకొచ్చేందుకు అసెంబ్లీలో చర్చ తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.