2028 టీ20 వరల్డ్ కప్‌కు 12 జట్లు!
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: 2028 టీ20 వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయని (ఐసీసీ) ప్రకటించింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయని ఐసీసీ వెల్లడించింది. ఇక 2026 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8కు చేరిన భారత్, దక్షిణాఫ్రికా, జింబావ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక కూడా నేరుగా అర్హత సాధించాయి. ఇంకా మూడు స్థానాలు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఖరారుకానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఆ స్థానాలు దక్కించుకునే అవకాశముంది. మార్చి 9న, 2026 ఫైనల్ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. మిగిలిన ఎనిమిది జట్లు వచ్చే రెండు సంవత్సరాల్లో జరిగే క్వాలిఫయర్ పోటీల ద్వారా ఎంపిక కానున్నాయి.
ఇదిలా ఉం టే, 2026 సూపర్ ఎయిట్స్ దశ ఫిబ్రవరి 21న ప్రారంభమవుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పోటీలు మొదలవుతాయి. భారత్ ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగనున్నాయి. రెండో సెమీ ఫైనల్ వాంకడే స్టేడియం (Wankhede Stadium)లో జరుగుతుంది.2028 టీ20 వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయని (ఐసీసీ) ప్రకటించింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయని ఐసీసీ వెల్లడించింది. ఇక 2026 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8కు చేరిన భారత్, దక్షిణాఫ్రికా,జింబావ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక కూడా నేరుగా అర్హత సాధించాయి.














