వివేకానందుని బాటలో యువత నడవాలి: చీఫ్ విప్

వివేకానందుని బాటలో యువత నడవాలి: చీఫ్ విప్హనుమకొండ జిల్లా : ధ్యానమే సరైన మార్గం అని ప్రపంచానికి చాటిన భగవాన్ శ్రీ రామకృష్ణ సేవా మందిరం నిర్మాణం వివేకానందుని ఆశీస్సులతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మాణం జరుగుతుందడం సంతోషదాయకమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవాలలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. హనుమకొండ కేఎల్ ఎన్ రెడ్డి కాలనీలోని కీ.శే. శ్రీ కుందూరు లక్ష్మీ నర్సింహారెడ్డి స్మారక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న భగవాన్ శ్రీ రామకృష్ణ సేవ మందిరం పూజ కార్యక్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానందుని చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం రామకృష్ణ మఠం సేవ మందిరం నిర్మాణానికి భూమిని మరియు నిధులను అందించిన కరుణాకర్ రెడ్డికి చీఫ్ విప్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఆలయ నిర్మాణం ఎలాంటి ఆట్టంకాలు లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వివేకానందుడి బాటలో యువత నడవాలన్నారు. ధ్యానించిన వారికి రామకృష్ణ సేవ మందిరం కేంద్ర బిందువు కానుంది, ఆలయ నిర్మాణానికి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వెంకట్ రెడ్డి కి పాదాభివందనం, సత్యనారాణ రెడ్డి మరియు రామకృష్ణ సేవ సమితి సభ్యుల సమిష్టి కృషితోనే ఇంత గొప్ప కార్యం సాధ్యం కానుంది అన్నారు దాస్యం.

హైదరాబాద్ రామకృష్ణ మఠం తరువాత ఇక్కడ నిర్మించిన రామకృష్ణ సేవ మందిరం అంతటి ప్రభావం పొందాలని ఆకాంక్షించారు హనుమకొండ నగరన్ని ఆధ్యాత్మికంగా క్షేత్రంగా తీర్చిదిద్దేందుకై భగవాన్ శ్రీ రామకృష్ణ సేవ మందిరం దోహదపడుతుందని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రామకృష్ణ మఠం సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.