కంటి వెలుగును సద్వినియోగించుకోవాలి : దాస్యం

కంటి వెలుగును సద్వినియోగించుకోవాలి : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 54వ డివిజన్ పోచమ్మకుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, 04వ డివిజన్ బాసిత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కొత్తూరు జెండా 05వ డివిజన్లోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమ్యూనిటీ హాల్లో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.కంటి వెలుగును సద్వినియోగించుకోవాలి : దాస్యంఈ సందర్భంగా కంటి వెలుగు శిబిరం ప్రారంభం అనంతరం పరీక్షల కోసం విచ్చేసిన వారికి ఈ ప్రత్యేక శిబిరం యొక్క ప్రాధాన్యతను వివరించారు. పరీక్ష చేసుకున్న ప్రజల కంటి చూపు మెరుగుదల గురించి ఆరా తీశారు. అనంతరం తానే స్వయంగా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కంటి పరీక్షలు చేసుకుని వారి సూచన మేరకు అద్దాలు తీసుకున్నారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ కోరారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు గుంటి రజిత శ్రీనివాస్, సోదా కిరణ్, చెన్నం మధు, బొంగు అశోక్ యాదవ్, చీకటి శారదా ఆనంద్, పోతుల శ్రీమాన్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, డి.ఎం.హెచ్.ఓ సాంబశివరావు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.