భూసేకరణ వర్క్స్ స్పీడప్ చేయాలి : భవేశ్ మిశ్రా

భూసేకరణ వర్క్స్ స్పీడప్ చేయాలి : భవేశ్ మిశ్రా

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో భూపాలపల్లి ఆర్డీవో మరియు మల్హర్ రావు మండలం తహసిల్దార్ తో సమావేశం నిర్వహించి భూసేకరణ కార్యక్రమాలపై సమీక్షించారు. జెన్కో కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి మల్హర్ రావు, భూపాలపల్లి, ఘనపూర్ మండలాల్లో సేకరిస్తున్న భూమి వివరాలను బాధిత రైతుకు ఉన్న మొత్తం భూమి కోల్పోతున్న భూమి వివరాలను సంబంధిత మూడు మండలాల తహసిల్దార్లతో సమీక్షించి పది రోజుల్లో అందించాలని అన్నారు. తాడిచర్ల గ్రామంలో ఓపెన్ కాస్ట్ వలన ఇళ్లను కోల్పోయిన లబ్ధిదారుల వివరాలను అందించాలని తహసిల్దార్ లకు సూచించారు.భూసేకరణ వర్క్స్ స్పీడప్ చేయాలి : భవేశ్ మిశ్రాగొల్ల బుద్ధారం పంపు హౌస్ లో భూమిని కోల్పోయిన 13 ఎకరాలకు సంబంధించి గొల్ల బుద్ధారం మరియు గండికామారం గ్రామాల రైతులకు త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులకు ఆదేశించారు. గడ్డిగానిపల్లి పునరావాసానికి సంబంధించిన ఏర్పాట్లను సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆర్డిఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, మల్హర్రావు మండల తాసిల్దార్ శ్రీనివాస్, కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సూపరింటిండెంట్, సెక్షన్ అధికారులు, ఆర్డిఓ, తహసిల్దార్ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.