ఒకే వాట్సప్ అకౌంట్ నాలుగు డివైజ్‌లలో..

వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో మాత్రమే వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునేలా సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలిపే WABetaInfo ప్రకారం త్వరలోనే ఈ ఫీచర్ రిలీజ్ కానుంది. ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత ఒకే అకౌంట్‌ని నాలుగుఒకే వాట్సప్ అకౌంట్ నాలుగు డివైజ్‌లలో..డివైజ్‌లలో ఒకేసారి వాడుకోవచ్చు. ఎక్కువ డివైజ్‌లు ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కొందరి చేతుల్లో మనం రెండు స్మార్ట్‌ఫోన్స్ చూస్తుంటాం. రెండు ఫోన్లలో ఒకే వాట్సప్ అకౌంట్‌ వాడుకోవచ్చు. అంతేకాదు… ట్యాబ్లెట్ వాడుతున్నా అదే అకౌంట్‌ని ట్యాబ్‌లో లాగిన్ చేయొచ్చు. ఇలా వేర్వేరు డివైజ్‌లలోని డేటా వైఫై కనెక్టివిటీ ద్వారా సింక్ అవుతుంది. గతేడాది నుంచి వాట్సప్ యూజర్లను ఊరిస్తున్న ఫీచర్ ఇది. ఐఓఎస్ బీటా వర్షన్‌లో కనిపించింది. అప్పట్నుంచీ ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్నారు. ఇక వాట్సప్ తేదీతో సెర్చ్ చేసే ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ వస్తే మీరు ఏ తేదీకి సంబంధించిన ఛాటింగ్ వివరాలు చూడాలనుకుంటే ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. ఆ రోజు మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి.