ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం

సూర్యాపేట: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యటకు తరలించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థీవ దేహం సూర్యాపేటకు చేరనుంది. కాగా, జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం