ఎంసెట్-2023 ఫలితాల్లో అల్ఫోర్స్ హవా

ఎంసెట్-2023 ఫలితాల్లో అల్ఫోర్స్ హవా

వరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా: ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల హవా కొనసాగించింది. రాష్ట్ర స్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది.అల్ఫోర్స్ యాజమాన్యం విద్యార్థులకు అందించిన తర్ఫీదుతో వెయ్యిలోపు 14 మంది, 5వేల లోపు 118 మంది ర్యాంకులు పొంది తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చబోతున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎం.అభిరామ్ 301వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానంలో నిలిచాడు. ఎ.ఇషాంత్ రెడ్డి 322, జీ జ్యోతి 374 ర్యాంకులు సాధించి కాలేజీలో రెండు, మూడో స్థానాలు సంపాదించారు.ఎంసెట్-2023 ఫలితాల్లో అల్ఫోర్స్ హవాఅగ్రికల్చర్ విభాగంలో బి.శ్రీగోధ 356, టి.దీపిక 446 ర్యాంకులు సాధించారు.ఎం.చిన్మయ్ 542, బి.శ్రీనివాస్ 650, ఎస్. సాయిసధిష్ట 681, కె.ప్రణితారెడ్డి 752, హస్వితారెడ్డి 818, బి.విద్యాలక్ష్మి 821, ఎస్.ధీరజ్ కుమార్ 833, ఎన్.మనస్విని 865,ఆర్.సుహాసిత 893వ ర్యాంకులు సాధించారు. 40 మంది విద్యార్థులు 2 వేల లోపు, 63 మంది విద్యార్థులు 3 వేల లోపు, 118 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక, అత్యద్భుత ర్యాంకులు సాధించటం అల్ఫోర్స్ విద్యార్థులకు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు.

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనే 450 మంది విద్యార్థులు అడ్వాన్స్ కు అర్హత సాధించడం అల్ఫోర్స్ ఉత్తమ విద్యా బోధనకు నిదర్శనంగా నిలిచారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షనతో ఘన విజయాలు సాధిస్తున్నామని విద్యార్థుల అభినందన సభలో చైర్మన్ డా.నరేందర్ రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ ఉత్తమ ర్యాంకులతో ముందంజలో ఉంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్త పరిచారు.