సీఎం రేవంత్ కు ప్రియాంకా గాంధీ అభినందన

సీఎం రేవంత్ కు ప్రియాంకా గాంధీ అభినందన

సీఎం రేవంత్ కు ప్రియాంకా గాంధీ అభినందనవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.