అప్రమత్తమైన తెలంగాణ ఆర్టీసీ

అప్రమత్తమైన తెలంగాణ ఆర్టీసీ

హనుమకొండ జిల్లా : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేడారం జాతర సమీపిస్తున్న దృష్ట్యా ఆర్టీసీ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆర్టీసీ సెలవుదినాలతో పాటు, ఉమ్మడి జిల్లాకు ముఖ్య కేంద్రమైన హనుమకొండ, వరంగల్‌, కాజీపేట బస్టాండ్ల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. దీనిలో భాగంగా బస్సులు డిపో నుంచి బయలుదేరే ముందు హైపోక్లోరైట్‌ ద్రావణంతో శానిటైజ్‌ చేస్తున్నారు. కండక్టర్లకు శానిటైజర్లను అందించి బస్సులో ఎక్కే భక్తులకు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. బస్టాండ్ల వద్ద మైకుల్లో జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.