బడ్జెట్ లో రైతులకు గుండు సున్నాపెట్టారు: కేసీఆర్

బడ్జెట్ లో రైతులకు గుండు సున్నాపెట్టారు: కేసీఆర్హైదరాబాద్ : దేశ ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ చెప్పారు కానీ, బడ్జెట్ లో మాత్రం వ్యవసాయరంగం గురించి ప్రస్తావనే లేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022పై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ను దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని, రైతులను పట్టించుకోలేదని , ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదని విమర్శించారు. యూరియా మీద సబ్సిడీని రూ.12,708 కోట్లు తగ్గించారు. ఇతర ఎరువుల మీద రూ.22190 కోట్లు తగ్గించారు. మొత్తం రూ.34,900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. ఇవన్నీ నేను చెబుతున్నవి కాదు. బడ్జెట్ ఫిగర్స్ .

గ్రామీణ ఉపాధీ హామీ పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారు. రూ.98 వేల కోట్లు ఉంటే 73 వేల కోట్లకు కుదించడం సిగ్గుచేటన్నారు8. గ్రామీణ ప్రాంతాల ప్రజల పట్ల నరేంద్ర మోడీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి తగ్గించడం, ఎరువులకు తగ్గించడం, నరేగాకు తగ్గించడం, ఎస్సీ, ఎస్సీలు 40 కోట్ల జనాభా ఉంటే 12 వేల కోట్ల బడ్జెట్ పెట్టడం సరైంది కాదన్నారు. అసలు దేని కోసం ఈ ప్రభుత్వం ఉంది, ఇది చాలా ఘోరమైన పరిస్థితి అంటూ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.