‘భామా కలాపం’ట్రైలర్ ను రిలీజ్ చేసిన విజయ్

‘భామా కలాపం’ట్రైలర్ ను రిలీజ్ చేసిన విజయ్సినిమా డెస్క్ : మీ సీట్ బెల్ట్స్‌ను గ‌ట్టిగా బిగించాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ప్ర‌తీ తెలుగు వారింటిలో భాగ‌మైన‌ 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో అద్భుత‌మైన ఇంటిని భోజ‌నంలాంటి థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజిన‌ల్ ఫిబ్ర‌వ‌రి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగ‌ర్’స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోమవారం విడుదల చేశారు.

జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ (రాధే శ్యామ్‌, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల ఫేమ్‌), మార్క్ రాబిన్ సంగీతం సార‌థ్యం వ‌హించిన ఈ ఒరిజిన‌ల్‌కు దీప‌క్ ఎర‌గేర సినిమాటోగ్ర‌ఫీ అందించారు. విప్ల‌వ్ నైష‌ధం ఎడిట‌ర్‌.

అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. శ్రీరామ్‌చంద్ర హోస్ట్ చేస్తున్న ఫ‌స్ట్ ఎవ‌ర్ సౌత్ ఇండియాస్ ఇండియ‌న్ ఐడ‌ల్‌. అదే మ‌న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే.