నాదల్ కే ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్

నాదల్ కే ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్స్పోర్ట్స్ డెస్క్ : ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభటోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. నేడు జరిగిన సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో డెనిల్ మెద్వెదేవ్ ను 2 – 6, 6 – 7, 6 – 4, 6 – 4, 7 – 5 తేడాతో విజయం సాధించాడు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్ లో ఆడటం ఇది ఆరోసారి.

శుక్రవారం జరిగిన సింగిల్స్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో మెటియో బెనెరెట్టినిపై విజయం సాధించిన నాదల్ ఫైనల్ లోకి వెళ్లాడు. మెద్వెదేవ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో సిట్సిపాస్ పై గెలిచి ఫైనల్ కు వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ లో నెగ్గి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా అత్యంత అరుదైన అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డు నాదల్ సొంతమైంది. దీంతో టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.

ఇప్పటికే స్పెయిన్ బుల్ నాదల్ 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచాడు. ప్రస్తుతం ఇతర టెన్నిస్ దిగ్గజాలైన నొవాక్ జకోవిక్, రోజర్ ఫెదరర్ తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కూడా ఆయన ఖాతాలో చేరింది. దీంతో టెన్నిస్ చరిత్రలో 21 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా రఫేల్ నాదల్ చరిత్ర సృష్టించాడు.