ఏపీ హైకోర్టు ఉద్యోగుల నిరసన

ఏపీ హైకోర్టు ఉద్యోగుల నిరసనఅమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియచేశారు. హైకోర్టు ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. 11 పీఆర్సీ కోసం వేసిన ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను కాకుండా అధికారులిచ్చాన నివేదికలను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగులకు నష్టం కల్గించే పీఆర్సీ జీవోలు ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశుతోష్ మిశ్రా రిపోర్టును బహిర్గతం చేసి అదే నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కరోనాతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని సాకులు చెబుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని వేణుగోపాల్ విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే చట్ట బద్దంగా విధులకు హాజరవుతూనే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.