25 వేల బోగస్ ఉద్యోగులపై ఫోరెన్సిక్ ఆడిట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: బోగస్ ఉద్యోగులతో అక్రమాలకు పాల్పడ్డ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్ధిక శాఖను అదేశించారు. రాష్ట్రంలో 25 వేల మంది ఉద్యోగులు లేకున్నా ఉన్నట్లుగా చూపించి నెల నెలా జీతాలు తీసుకున్నట్లు ఆధార్ లింకేజీతో బయటపడింది. కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిందని తేలింది. పదేండ్లుగా జరిగిన ఈ మోసంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని సీఎం అదేశించారు. బాధ్యులను విడిచి పెట్టేది లేదని, లోతైన విచారణకు వెంటనే కేసులు నమోదు చేయాలని అదేశించారు.













