ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్ 

ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 గంటల నుంచి మార్చి 14 మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెల్పింది. అభ్యర్థులు ఒకేసారి అన్ని కాలేజీలకు ప్రాధాన్యతాక్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని వెల్లడించింది.